Skip to main content

శరీరాకృతిని మెరుగుపరుచుకునే యోగ --తాడాసనం

శరీరాకృతిని మెరుగుపరుచుకునే యోగ మీ శరీరాకృతిని జీవితాంతం ఉంచుకోవడానికి పరిష్కారం యోగానే, మీరు మీ శరీరాకృతి కోసం ఎన్నో చేస్తూ ఉంటారు, రాత్రి పూట భోజనం మానేయడం, మధ్యాహ్నం అకలితో పని చేసుకోవడం, ట్రెడ్మిల్ యంత్రం పై పరుగులు తీయడం,ఇలా ఎన్నో చేస్తూ అసలు విషయం మరచిపొతూ ఉంటారు, మనం తెలుసుకోవలసింది, ఆరోగ్యం మరియు ఫిట్నెస్ పొందాలంటే, మన మానసిక ఆరోగ్యం ఎంతో ప్రశాంతంగా ఉంచుకోవాలి. మానసిక ప్రశాంతతను యోగ ద్వారా పొందవచ్చు. ఆరోగ్యం, శరీరాకృతి మరియు ఫిట్నెస్ కోసం తాడాసన సిరీస్ ఉపయోగపడుతుంది. తాడాసనం: తాడ అంటే సంస్కృతంలో పర్వతమని అర్థం. యోగప్రక్రియలో కదలకుండా సమస్థతిలో నిలబడి చేసేదే తాడాసనం. తాడాసనం: ఆసనం వేయు పద్దతి : A) రెండు పాదముల మధ్య కొంచెం దూరముగా ఉండునట్లుగా నిలబడి నిటారుగా ఉండాలి. మోకాళ్ళు, తొడలు, పిరుదలు, ఉదర భాగంలోని కండరాలను కొద్దిగా బిగుతుగా ఉండేలా చూడాలి. స్థిర స్థితిలో ఉండాలి. ముక్కు రంధ్రం ద్వారా గాలి పీల్చుకోవాలి. B) అలాగే భుజాలను పైకి లేపి చేతులను కలపాలి. అదేసమయంలో కలిపిన అరచేతులు ఆకాశాన్ని చూస్తూ ఉండాలి. C) ఈ విధంగా చేసే సమయంలో కాలివేళ్ళపై నిలబడుతూ పైకి లేవాలి. కొద్ది సమయం అలాగే ఉన్న తరువాత మెళ్ళగా గాలి వదులుతూ పూర్వ స్థితికి రావాలి. తరువాత కాళ్ళను దూరం చేస్తూ విశ్రాంతి తీసుకోవాలి. పార్శ్వ తాడాసనం: A) రెండు పాదముల మధ్య కొంచెం దూరముగా ఉండునట్లుగా నిలబడి చేతులు రెండు పైకెత్తి రెండు చేతివేళ్ళను ఒక దానితో ఒకటి చొప్పించి అరచేతులు పైకి ఉండునట్లుగా త్రిప్పాలి. D) కాళ్ళు కదపకూండా శ్వాస విడిచిపెడుతూ నడుము పైభాగాన్ని కుడి ప్రక్కకు వంచాలి.శ్వాస తీసుకుంటూ మెుదటి స్థితికి రావాలి. E) కాళ్ళు కదపకూండా శ్వాస విడిచిపెడుతూ నడుము పైభాగాన్ని ఎడమ ప్రక్కకు వంచాలి.శ్వాస తీసుకుంటూ మెుదటి స్థితికి రావాలి. తిర్యక్ తాడాసనం: A) రెండు పాదముల మధ్య కొంచెం దూరముగా ఉండునట్లుగా నిలబడి చేతులు రెండు పైకెత్తి రెండు చేతివేళ్ళను ఒక దానితో ఒకటి చొప్పించి అరచేతులు పైకి ఉండునట్లుగా త్రిప్పాలి. F) కాళ్ళు కదపకూండా శ్వాస విడిచిపెడుతూ నడుము పైభాగాన్ని కుడి ప్రక్కకు తిప్పాలి. శ్వాస తీసుకుంటూ మెుదటి స్థితికి రావాలి. G) కాళ్ళు కదపకూండా శ్వాస విడిచిపెడుతూ నడుము పైభాగాన్ని ఎడమ ప్రక్కకు తిప్పాలి. శ్వాస తీసుకుంటూ మెుదటి స్థితికి రావాలి. ప్రయోజనాలు: మలబద్ధకం పోగొట్టును, శరీరమంతా పూర్తిగా సాగడం వలన కండరాలు, నరాలు, ప్రేగులు, వెన్నెముక ఉత్తేజితమై శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. చేతులు, కాళ్లు, నడుము బలంగా తయారవుతాయి. కండరాల నొప్పులకు ఉపశమనం లభిస్తుంది. రక్తప్రసరణ వ్యవస్థ చాలా చక్కగా పనిచేస్తుంది. శ్వాస చక్కగా జరుగుతుంది. శరీరం బలిష్ఠంగా తయారవుతుంది. జీర్ణాశక్తిని పెంచును, మానసిక ఒత్తిడులను తొలగిస్తుంది. శరీరానికి చక్కటి ఆకృతిని ఇస్తుంది. మెరుగైన అరోగ్యం, శరీరాకృతిని పొందాలంటే: సాద్యమైనంత వరకూ అధిక కొవ్వు, క్యాలరీలతో కూడిన ఆహారమును దూరంగా ఉంచండి. పాల ఉత్పత్తులు , చాక్లెట్ బార్లు , వెన్న వంటి పదార్దాలు లేని ఆహారం తీసుకోవడం ఎంతో అవసరం. రోజుకి 30 నిమిషాలు యోగ చేస్తే ఉపయోగపడని క్యాలరీలు కరిగి , శరీరంలోని కొవ్వు శాతం తగ్గి గుండెకు ఎంతో మంచిది. మీరు తీసుకునే భోజనంలో ఎంతో జాగ్రత్తలు తీసుకోవడం అవసరం, సమాన్యంగా అన్నింటిలో కొవ్వు, క్యాలరీలు కలిగి ఉండటం వల్ల అవి తీసుకున్నచో మీరు లావుగా మారే ప్రమాదం ఉంది. ఎక్కువగా మంచి ఆహారం తీసుకుంటే మీ శరీరాక్రుతిని కాపడుకోవచ్చు.వ్యాయామం చేయడం చాలా అవసరం. ఎక్కువ శాతం మంచి నీరు తీసుకోవడం ఎంతో అవసరం, రోజుకి కనీసం 2-3 Lts నీరు అవసరం.

Comments

Popular posts from this blog

వజ్రాసనం వల్ల గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు -- వజ్రాసనం

వజ్రాసనం వల్ల గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు శరీరాన్ని ఎల్లప్పుడూ కండిషన్‌లో ఉంచే అద్భుతమైన ఆసనం వజ్రాసనమే. పేరుకి తగ్గట్లే అది శరీరాన్ని వజ్రంలా చేస్తుంది.... క్రమంతప్పకుండా వజ్రాసనాన్ని ప్రతిరోజు చేస్తున్న పక్షంలో దేహానికి పటుత్వం, స్థిరత్వం ఏర్పడుతుంది. సంస్కృత భాషలో 'వజ్ర' అనగా దృఢం అని అర్ధం. వజ్రాసన భంగిమను దాల్చిన యోగసాధకులు దృఢమైన చిత్తానికి ప్రతినిధులుగా కనిపిస్తారు. తదనుగుణంగా ఈ ఆసనానికి వజ్రాసనమనే పేరు వచ్చింది. మిగతా అన్ని ఆసనాలను ఎప్పుడు పడితే అప్పుడు వేయడం సరైనది కాదు. కానీ వజ్రాసనాన్ని 24 గంటల్లో ఎప్పుడైనా వేయొచ్చు. ఈ ఆసనంలో మెడిటేషన్ చేయొచ్చు, ప్రాణాయామం చేయొచ్చు.... ఆస‌నం వేయు విధానం: A) కాళ్లను ముందుకు చాపి దండాసన పద్ధతిలో కూర్చోవాలి. B)మోకాళ్ల మీద కూర్చోవాలి. ఎడ‌మ‌కాలి బ్రొట‌న‌ వేలు కుడికాలి బ్రోట‌న వేలు దగ్గరగా వుంచి పాదాల పైభాగం నేల‌ను తాకేట‌ట్టు వెడ‌ల్పు చేయాలి. C)రెండు పాదాల లోప‌లి భాగం 'V' ఆకృతిలో వుంటుంది. దాని మ‌ధ్య భాగంతో కూర్చొవాలి. శ‌రీర పీఠ భాగం పూర్తిగా పాదాల మ‌ధ్య ఇమిడేట‌ట్లు చూసుకోవాలి. D)రెండు అరిచేతులు తొడ‌లు పై వుంచాలి. మెడ, వీపు,...

యోగ అంటే ఏమిటి?

యోగ అంటే ఏమిటి? "యుజ్" అనే సంస్కృత ధాతువు నుండి "యోగ" అనే పదం ఉత్పన్నమైంది. మానవుని మానసిక శక్తులన్నింటిని ఏకాగ్రత సాధించడం యోగము. "యుజ్" అనగా "కలయిక". యోగా అంటే వ్యాయామ సాధనల సమాహారాల రూపం. యోగములో భాగమైన శారీరకమైన ఆసనాలు శరీరారోగ్యానికి తోడ్పడి ఔషధాల వాడకాన్ని తగ్గించి దేహధారుడ్యాన్ని, ముఖ వర్చస్సుని ఇనుమడింప చేస్తుంది. సింధు నాగరికత చిత్రాల ఆధారంగా యోగా వారి నాగరికతలో భాగంగా విశ్వసిస్తున్నారు. సన్యాస శిక్షణలోను యోగా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇతర వ్యాయామాకంటే భిన్నమైన యోగాభ్యాసము దానిలో దేశవిదేశాలలో విశేషప్రాచుర్యాన్ని సంతరించుకున్నది. యోగా ప్రాచుర్యము, ఆదరణ అమోఘమైనది. యోగా మీద ఉన్న విశేషమైన మక్కువ, ఆకర్షణ లోక విదితం. భారతీయ సంప్రదాయిక యోగశిక్షణా తరగతులను అనేక దేశాలలో నిర్వహిస్తున్నారు. ఇతర వ్యాయాయములు శరీరదారుఢ్యాన్ని మాత్రమే మెరుగు పరచడములోదృష్టిని సారిస్తాయి. యోగాభ్యాసము లోని ధ్యానం, ప్రాణాయామం లాంటి ప్రక్రియలు మానసిక ఏకాగ్రత వలన ప్రశాంతతను కలిగించి మానసిక ఆరోగ్యానికి కూడా దోహద పడుతుంది. మానసిక వత్తిడులు, హృద్రోగము, రక్తపోటు లాంటి వ్యాధ...