యోగ అంటే ఏమిటి?
"యుజ్" అనే సంస్కృత ధాతువు నుండి "యోగ" అనే పదం ఉత్పన్నమైంది. మానవుని మానసిక శక్తులన్నింటిని ఏకాగ్రత సాధించడం యోగము. "యుజ్" అనగా "కలయిక".
యోగా అంటే వ్యాయామ సాధనల సమాహారాల రూపం. యోగములో భాగమైన శారీరకమైన ఆసనాలు శరీరారోగ్యానికి తోడ్పడి ఔషధాల వాడకాన్ని తగ్గించి దేహధారుడ్యాన్ని, ముఖ వర్చస్సుని ఇనుమడింప చేస్తుంది.
సింధు నాగరికత చిత్రాల ఆధారంగా యోగా వారి నాగరికతలో భాగంగా విశ్వసిస్తున్నారు. సన్యాస శిక్షణలోను యోగా ప్రధాన పాత్ర పోషిస్తుంది.
ఇతర వ్యాయామాకంటే భిన్నమైన యోగాభ్యాసము దానిలో దేశవిదేశాలలో విశేషప్రాచుర్యాన్ని సంతరించుకున్నది. యోగా ప్రాచుర్యము, ఆదరణ అమోఘమైనది. యోగా మీద ఉన్న విశేషమైన మక్కువ, ఆకర్షణ లోక విదితం. భారతీయ సంప్రదాయిక యోగశిక్షణా తరగతులను అనేక దేశాలలో నిర్వహిస్తున్నారు. ఇతర వ్యాయాయములు శరీరదారుఢ్యాన్ని మాత్రమే మెరుగు పరచడములోదృష్టిని సారిస్తాయి. యోగాభ్యాసము లోని ధ్యానం, ప్రాణాయామం లాంటి ప్రక్రియలు మానసిక ఏకాగ్రత వలన ప్రశాంతతను కలిగించి మానసిక ఆరోగ్యానికి కూడా దోహద పడుతుంది. మానసిక వత్తిడులు, హృద్రోగము, రక్తపోటు లాంటి వ్యాధుల తీవ్రత తగ్గించటానికి తోడ్పడుతుందని విశ్వాసం. సనాతన సంప్రదాయమైన యోగా అధునిక కాలంలో అనేకమంది అధునికుల అభిమానాన్ని చూరగొన్నది
భారతీయ తత్వ శాస్త్రంలోని ఆరు దర్శనాలలో "యోగ దర్శనము" ఒకటి. ఈ యోగ దర్శనానికి ఆద్యుడు పతంజలి. యోగసూత్రాల ప్రకారం "యోగం అంటే చిత్త వృత్తి నిరోధం". అభ్యాస వైరాగ్యాల వలన చిత్త వృత్తులను నిరోధించడం సాధ్యమవుతుంది. ఇలా సాధించే ప్రక్రియను "పతంజలి అష్టాంగ యోగం' అంటారు. దీనినే రాజయోగం అంటారు.
వజ్రాసనం వల్ల గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు శరీరాన్ని ఎల్లప్పుడూ కండిషన్‌లో ఉంచే అద్భుతమైన ఆసనం వజ్రాసనమే. పేరుకి తగ్గట్లే అది శరీరాన్ని వజ్రంలా చేస్తుంది.... క్రమంతప్పకుండా వజ్రాసనాన్ని ప్రతిరోజు చేస్తున్న పక్షంలో దేహానికి పటుత్వం, స్థిరత్వం ఏర్పడుతుంది. సంస్కృత భాషలో 'వజ్ర' అనగా దృఢం అని అర్ధం. వజ్రాసన భంగిమను దాల్చిన యోగసాధకులు దృఢమైన చిత్తానికి ప్రతినిధులుగా కనిపిస్తారు. తదనుగుణంగా ఈ ఆసనానికి వజ్రాసనమనే పేరు వచ్చింది. మిగతా అన్ని ఆసనాలను ఎప్పుడు పడితే అప్పుడు వేయడం సరైనది కాదు. కానీ వజ్రాసనాన్ని 24 గంటల్లో ఎప్పుడైనా వేయొచ్చు. ఈ ఆసనంలో మెడిటేషన్ చేయొచ్చు, ప్రాణాయామం చేయొచ్చు.... ఆసనం వేయు విధానం: A) కాళ్లను ముందుకు చాపి దండాసన పద్ధతిలో కూర్చోవాలి. B)మోకాళ్ల మీద కూర్చోవాలి. ఎడమకాలి బ్రొటన వేలు కుడికాలి బ్రోటన వేలు దగ్గరగా వుంచి పాదాల పైభాగం నేలను తాకేటట్టు వెడల్పు చేయాలి. C)రెండు పాదాల లోపలి భాగం 'V' ఆకృతిలో వుంటుంది. దాని మధ్య భాగంతో కూర్చొవాలి. శరీర పీఠ భాగం పూర్తిగా పాదాల మధ్య ఇమిడేటట్లు చూసుకోవాలి. D)రెండు అరిచేతులు తొడలు పై వుంచాలి. మెడ, వీపు,...
Comments
Post a Comment