Skip to main content

Posts

చక్రాసనము

చక్రాసనము : ఈ ఆసనం చక్రం ఆకారంలో ఉంటుంది కనుక దీనికి చక్రాసనమని పేరువచ్చింది. చక్రాసనము ఆస‌నం వేయు విధానం: మొదట వెల్లకిలా పడుకోవాలి. A) పాదములు పిరుదుల వద్దకు తీసుకువచ్చి నేలకు త్ర్రాకించాలి. చేతులను పైనుండి తీసుకువెళ్ళి తలకు ఇరువైపులా నేలకు త్రాకించాలి. B) చేతుల సాయంతో నడుమును వీలైనంత పైకి ఎత్తాలి. తలను నేలపై ఆనించాలి. C) సుధీర్ఘ శ్వాస తీసుకుంటూ చేతుల సాయంతో శరీరాన్ని పైకి తీసుకురావలి. మెడ కిందికి వేలాడుతుండాలి. ఇదియే చక్రాసనము. B) ఉండగలిగినంతసేపు ఈ స్థితిలో ఉన్న తరువాత మెల్లమెల్లగా తలను నేలపై ఆనించాలి. నడుమును గూడా ఆనించి తర్వాత కొద్ది క్షణాల సేపు శవాసనం వేసి విశ్రాంతి తీసుకోవాలి. సూచన: ప్రారంభదశలో తలను నేలపైననే ఆనించి అర్థ చక్రాసనం(B) అభ్యాసం చేయవచ్చును. చేతులపై శరీరం బరువును ఆపగలమన్న ధైర్య కలిగేవరకు తల ఆనించి అభ్యాసం కొనసాగించవచ్చును. చక్రాసనము ఉపయోగం: 1. వయస్సు పెరగకుండా చేయును. 2. ముఖము కాంతివంతమగును. 3. వెన్నుముక బలోపేతమై ధ్యాన సాధనకు ఉపయోగపడును. 4. థైరాయిడ్, గ్యాస్ట్రిక్, మలబద్ధకం తొలగును. 5. చేతి కండరాలు, తొడలు, కాలి కండరాలు బలోపేతమగును. 6. ఆస్త్మా, సైనస్ వంట...
Recent posts

వజ్రాసనం వల్ల గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు -- వజ్రాసనం

వజ్రాసనం వల్ల గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు శరీరాన్ని ఎల్లప్పుడూ కండిషన్‌లో ఉంచే అద్భుతమైన ఆసనం వజ్రాసనమే. పేరుకి తగ్గట్లే అది శరీరాన్ని వజ్రంలా చేస్తుంది.... క్రమంతప్పకుండా వజ్రాసనాన్ని ప్రతిరోజు చేస్తున్న పక్షంలో దేహానికి పటుత్వం, స్థిరత్వం ఏర్పడుతుంది. సంస్కృత భాషలో 'వజ్ర' అనగా దృఢం అని అర్ధం. వజ్రాసన భంగిమను దాల్చిన యోగసాధకులు దృఢమైన చిత్తానికి ప్రతినిధులుగా కనిపిస్తారు. తదనుగుణంగా ఈ ఆసనానికి వజ్రాసనమనే పేరు వచ్చింది. మిగతా అన్ని ఆసనాలను ఎప్పుడు పడితే అప్పుడు వేయడం సరైనది కాదు. కానీ వజ్రాసనాన్ని 24 గంటల్లో ఎప్పుడైనా వేయొచ్చు. ఈ ఆసనంలో మెడిటేషన్ చేయొచ్చు, ప్రాణాయామం చేయొచ్చు.... ఆస‌నం వేయు విధానం: A) కాళ్లను ముందుకు చాపి దండాసన పద్ధతిలో కూర్చోవాలి. B)మోకాళ్ల మీద కూర్చోవాలి. ఎడ‌మ‌కాలి బ్రొట‌న‌ వేలు కుడికాలి బ్రోట‌న వేలు దగ్గరగా వుంచి పాదాల పైభాగం నేల‌ను తాకేట‌ట్టు వెడ‌ల్పు చేయాలి. C)రెండు పాదాల లోప‌లి భాగం 'V' ఆకృతిలో వుంటుంది. దాని మ‌ధ్య భాగంతో కూర్చొవాలి. శ‌రీర పీఠ భాగం పూర్తిగా పాదాల మ‌ధ్య ఇమిడేట‌ట్లు చూసుకోవాలి. D)రెండు అరిచేతులు తొడ‌లు పై వుంచాలి. మెడ, వీపు,...

యోగ ద్వారా డయాబెటిస్ ను నియంత్రించవచ్చును -- వక్రాసనం

యోగ ద్వారా డయాబెటిస్ ను నియంత్రించవచ్చును. డయాబెటిస్ అనేది తీవ్ర అనారోగ్య సమస్య అయింది. ప్రపంచవ్యాప్తంగా షుగర్ వ్యాధి రోగుల సంఖ్య పెరుగుతోంది. నయం చెయ్యడం కుదరని ఈ వ్యాధిని నియంత్రించాల్సి వుంటుంది. డయాబెటిస్ ఇన్స్యులిన్ హార్మోన్ స్థాయి తగ్గడం వల్ల కలిగే అనియంత్రిత మెటబాలిజం మరియు రక్తంలో అధిక గ్లూకోజ్ స్థాయి వంటి లక్షణాలతో కూడిన ఒక రుగ్మత . అతిమూత్రం , దాహం ఎక్కువగా వేయడం, మందగించిన చూపు, కారణం లేకుండా బరువు తగ్గడం మరియు బద్ధకం దీని ముఖ్య లక్షణాలు. మధుమేహం సాధారణంగా రక్తంలో మితి మీరిన చక్కెర స్థాయిని బట్టి గుర్తిస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం భారత దేశం, చైనా, అెరికాలలో అత్యధికంగా ఈ వ్యాధి ప్రబలి ఉన్నది . ఈ వ్యాధిని పూర్తిగా తగ్గించే మందులు లేవు. జీవితాంతం తగిన జాగ్రత్తలు తీసుకొన్నట్లయితే దీన్ని అదుపులో ఉంచుకోవడం సాధ్యం. యోగ ఆసనాల ద్వారా డయాబెటిస్ ను నియంత్రించవచ్చును. వక్రాసనం: సంస్కృతంలో వక్ర అంటే వంకర అని అర్థం. వెన్నెముకను శరీరంలో ఒక వైపుకు వంకరగా తిప్పగలిగే ఆసనమే వక్రాసనం. చేసే పద్ధతి: A) కాళ్లను ముందుకు చాపి దండాసన పద్ధతిలో కూర్చోవాలి. B)కుడికాలిని పైకి మడిచ...

శరీరాకృతిని మెరుగుపరుచుకునే యోగ --తాడాసనం

శరీరాకృతిని మెరుగుపరుచుకునే యోగ మీ శరీరాకృతిని జీవితాంతం ఉంచుకోవడానికి పరిష్కారం యోగానే, మీరు మీ శరీరాకృతి కోసం ఎన్నో చేస్తూ ఉంటారు, రాత్రి పూట భోజనం మానేయడం, మధ్యాహ్నం అకలితో పని చేసుకోవడం, ట్రెడ్మిల్ యంత్రం పై పరుగులు తీయడం,ఇలా ఎన్నో చేస్తూ అసలు విషయం మరచిపొతూ ఉంటారు, మనం తెలుసుకోవలసింది, ఆరోగ్యం మరియు ఫిట్నెస్ పొందాలంటే, మన మానసిక ఆరోగ్యం ఎంతో ప్రశాంతంగా ఉంచుకోవాలి. మానసిక ప్రశాంతతను యోగ ద్వారా పొందవచ్చు. ఆరోగ్యం, శరీరాకృతి మరియు ఫిట్నెస్ కోసం తాడాసన సిరీస్ ఉపయోగపడుతుంది. తాడాసనం: తాడ అంటే సంస్కృతంలో పర్వతమని అర్థం. యోగప్రక్రియలో కదలకుండా సమస్థతిలో నిలబడి చేసేదే తాడాసనం. తాడాసనం: ఆసనం వేయు పద్దతి : A) రెండు పాదముల మధ్య కొంచెం దూరముగా ఉండునట్లుగా నిలబడి నిటారుగా ఉండాలి. మోకాళ్ళు, తొడలు, పిరుదలు, ఉదర భాగంలోని కండరాలను కొద్దిగా బిగుతుగా ఉండేలా చూడాలి. స్థిర స్థితిలో ఉండాలి. ముక్కు రంధ్రం ద్వారా గాలి పీల్చుకోవాలి. B) అలాగే భుజాలను పైకి లేపి చేతులను కలపాలి. అదేసమయంలో కలిపిన అరచేతులు ఆకాశాన్ని చూస్తూ ఉండాలి. C) ఈ విధంగా చేసే సమయంలో కాలివేళ్ళపై నిలబడుతూ పైకి లేవాలి. కొద్ది సమయం అ...

యోగతో వెన్నెముక సమస్యలకు ఉపశమనం

యోగతో వెన్నెముక సమస్యలకు ఉపశమనం నిశ్చలమైన జీవనశైలిని అనుసరించేవారు ఎక్కువగా వీపు నొప్పితో భాదపడుతుంటారు. యోగ నొప్పులను ఉపశమన పరుచుటలో శక్తివంతంగా పనిచేస్తుంది. మరియు వీపులో కలిగే నొప్పులను దూరం చేస్తుంది. వెన్నెముక మనుషుల వెన్నెముకలో 33 వెన్నుపూసలు(Vertebrae) శరీరం వెనకభాగంలో మెడనుండిపిరుదుల వరకు ఒకదానిపై ఒకటి అమర్చబడి ఉంటాయి. గ్రీవ కశేరుకాలు (Cervical vertebra) - 7 వక్షీయ కశేరుకాలు(Thoracic vertebra)-12 *కటి కశేరుకాలు (Lumbar vertebra) - 5* త్రికము (Sacrum) - 5 అనుత్రికము (Coccyx) - 4 వెన్నెముక దృఢంగా తయారవడానికి యోగ ఆసనాలు వేయాలి. కటి చక్రాసనం: కటి అంటే నడుము. కటిని తిప్పే ఈ ఆసనాన్ని కటి చక్రాసనం అంటారు. దీని వలన శరీరానికి,వెన్నెముకచాలా మేలు జరుగుతుంది. ఆసనం వేయు పద్దతి: A)చదునైన నేలపై నిటారుగా నిలబడాలి.తల వెనుకభాగం సమాంతరంగా ఉండేలా చూడాలి.చూపు ఎదురుగా ఉండాలి.చేతులను ముందుకు చాపాలి.అలాగే కాళ్ళ మధ్య కనీసం అరమీటరు దూరం ఉండేలా చూడాలి. B) ఎడమ చేతిని కుడి భుజంపైకి తీసుకురావాలి. కుడిభుజాన్ని వెనుకకు మడవాలి. కుడి భుజంపై నుంచి వీలైనంత వరకు చూడాలి. ఈ స్థితిలో కొన్ని సెకనులు నిలబ...

యోగ ద్వారా ఉదరకోశ సమస్యలను తగ్గించుకోవచ్చు.

యోగ ద్వారా ఉదరకోశ సమస్యలను తగ్గించుకోవచ్చు. ఉదరకోశ సమస్యలు: పేగుల్లో తయారయ్యే గ్యాస్ మహా ఇబ్బందిని, అసౌకర్యాన్ని కలిగిస్తుంది. గ్యాస్‌తో పొట్ట ఉబ్బరించి ఉదరంలో నొప్పిని కలిగిస్తుంది. ఇది బయటకు రావటానికి ప్రయత్నించటంతోనే త్రేన్పులు వస్తుంటాయి. మలద్వారం నుంచి విడుదలయ్యే గ్యాస్‌ని అపాన వాయువు అనే పేరుతో వ్యవహరిస్తారు. ప్రతివారిలోనూ గ్యాస్ తయారవుతూనే ఉంటుంది. ప్రేగుల్లో తయారయ్యే గ్యాస్‌లో ఆక్సిజన్, నైట్రోజన్, హైడ్రోజన్, కార్బన్ డై ఆక్సైడ్, మిథేన్ వంటి వాయువులు ఉంటాయి. ఆహార ,విహారాదుల్లో నియమం తప్పకుండా వుంటే ఆరోగ్యం గా ఉంటాం . ఈ కాలం లో అంతా బిజీబిజి తిండి తినడనికి తగిన సమయం ఉండడం లేదు. గ్యాస్ సమస్య కలిగినవారికి కడుపునొప్పిగా అనిపిస్తుంది. రోజుల తేడాతో పొట్ట వచ్చినట్లు మళ్లీ అంతలోనే తగ్గిపోయినట్లు కనిపించటం కూడా గ్యాస్ లక్షణమే. కారణాలు మాట్లాడేటప్పుడు ఆహారాలను మింగటం, ఆహారాన్ని నమలకుండా గబగబ మింగటం; చూయింగ్‌గమ్ వంటి వాటిని అదే పనిగా నమలటం; స్ట్రాతో ద్రవహారాలను తాగటం. ఆహారంలోని పిండి పదార్థాలు జీర్ణం కాకపోతే పెద్ద పేగులోని బ్యాక్టీరియా చర్య జరిపి పులిసిపోయేలా చేసి గ్యాస్‌ని విడుదల చ...

మెడ ఆకృతి, ఆరోగ్యాన్ని పెంచే యోగా

మెడ ఆకృతి, ఆరోగ్యాన్ని పెంచే యోగా మెడ ముఖానికి అందాన్ని జతచేస్తుంది.ఒత్తిడి మెడ కండరాలను బిగుతుపరిచి, కండరాల అలసటకు దోహదం చేస్తుంది.యోగ ఆరోగ్యమైన మెడను పొందుటకు సహాయపడుతుంది.మెడకు మంచి ప్రయోజనాలు పొందుటకు యోగాభ్యాసం దోహదం చేస్తుంది. మెడ సన్నని కాండంలాంటి అవయవం, తలకి ఇరువైపులా మద్దతును ఇవ్వడంతో పాటు, తలను పైకి మరియు క్రిందికి వంచడానికి మరియు దాదాపు 180 డిగ్రీల వరకు తిప్పడానికి అనుమతిస్తుంది. మెడపై నిరంతర కదలికల కారణంగా చర్మంపై ఏర్పడే వృద్ధాప్య సంకేతాలు, దుస్తులు మరియు బయటి వాతావరణం వలన కలిగే ఘర్షణ వంటివి చాలా ప్రభావితం చేస్తాయి. రోజువారీ అలవాట్లు కూడా చర్మం కుంగిపోవడానికి దోహదం చేస్తాయి. ఒక ఇబ్బందికరమైన స్థితిలో నిద్రించడం, హఠాత్తుగా పడుకోవడం, చెవికి మరియు భుజానికి మధ్య సెల్ ఫోన్ ను నొక్కి పట్టడం, కోపం, భయం లేదా మానసిక ఒత్తిడి వంటివి మెడ కండరాలు బిగుసుకు పోవడానికి, కండరాల అలసటకు దోహదం చేస్తాయి. మెడను నాణ్యతతో మరియు ఆరోగ్యాంతో కొనసాగించటానికి కొన్ని ప్రత్యేక ఆసనాలు చేయాల్సిన అవసరం ఉంది. (గ్రీవ అనగా సంస్కృతిలో మెడ) "గ్రీవ సంచలన ఆసనాలు" భుజాలను ముందుకు ఉంచి, కళ్ళను నె...