Skip to main content

యోగతో వెన్నెముక సమస్యలకు ఉపశమనం

యోగతో వెన్నెముక సమస్యలకు ఉపశమనం నిశ్చలమైన జీవనశైలిని అనుసరించేవారు ఎక్కువగా వీపు నొప్పితో భాదపడుతుంటారు. యోగ నొప్పులను ఉపశమన పరుచుటలో శక్తివంతంగా పనిచేస్తుంది. మరియు వీపులో కలిగే నొప్పులను దూరం చేస్తుంది. వెన్నెముక మనుషుల వెన్నెముకలో 33 వెన్నుపూసలు(Vertebrae) శరీరం వెనకభాగంలో మెడనుండిపిరుదుల వరకు ఒకదానిపై ఒకటి అమర్చబడి ఉంటాయి. గ్రీవ కశేరుకాలు (Cervical vertebra) - 7 వక్షీయ కశేరుకాలు(Thoracic vertebra)-12 *కటి కశేరుకాలు (Lumbar vertebra) - 5* త్రికము (Sacrum) - 5 అనుత్రికము (Coccyx) - 4 వెన్నెముక దృఢంగా తయారవడానికి యోగ ఆసనాలు వేయాలి. కటి చక్రాసనం: కటి అంటే నడుము. కటిని తిప్పే ఈ ఆసనాన్ని కటి చక్రాసనం అంటారు. దీని వలన శరీరానికి,వెన్నెముకచాలా మేలు జరుగుతుంది. ఆసనం వేయు పద్దతి: A)చదునైన నేలపై నిటారుగా నిలబడాలి.తల వెనుకభాగం సమాంతరంగా ఉండేలా చూడాలి.చూపు ఎదురుగా ఉండాలి.చేతులను ముందుకు చాపాలి.అలాగే కాళ్ళ మధ్య కనీసం అరమీటరు దూరం ఉండేలా చూడాలి. B) ఎడమ చేతిని కుడి భుజంపైకి తీసుకురావాలి. కుడిభుజాన్ని వెనుకకు మడవాలి. కుడి భుజంపై నుంచి వీలైనంత వరకు చూడాలి. ఈ స్థితిలో కొన్ని సెకనులు నిలబడాలి. ఇలాగే కొద్దసేపు నిలబడిన తరువాత పూర్వస్థితికి రావాలి. C) అలాగే కుడిచేతిని ఎడమ భుజంపైకి తీసుకువస్తూ ఎడమ భుజాన్ని వెనుకకు మడవాలి. ఎడమ భుజంపై నుంచి వీలైనంత వరకు చూడాలి. ఈ స్థితిలో కొన్ని సెకనులు నిలబడాలి. ఇలాగే కొద్దసేపు నిలబడిన తరువాత పూర్వస్థితికి రావాలి. ఇలా కనీసం 10 మార్లు చేయాలి. ప్రయోజనాలు: పొట్టలోని భాగలకు, ప్రేగులకు వ్యాయామము జరిగి వాటిలోని లోపములను తొలగిస్తుంది. ఛాతీభాగాన్ని, భుజములకు బలమునిస్తుంది. వెన్నెముకను, ప్రక్కటెముకలను దృఢంగా చేస్తుంది. పొట్టలోని క్రొవ్వును కరిగిస్తుంది. వెన్నెముక సమస్యలను తొలగిస్తుంది. జాగ్రత్తలు: భుజం నొప్పి ఉన్నవారు ఈ ఆసనాన్ని వేయకపోవడం మంచిది. అవసరమైనంత విశ్రాంతి తీసుకోండి. ఎక్కువ సమయం మీ వెన్ను భాగాన్ని కదలకుండా ఉంచకండి దీని వలన నొప్పి మరింత ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. ఎక్కువ సమయం కదలకుండా ఉండటం వలన వెన్నుపూస బిగుతుగా మారి, నొప్పి అధికం అవుతుంది. కొన్ని నిమిషాల ఒత్తిడి తరువాత, మీ చేతులను మరియు కాళ్ళను త్రిప్పడం వలన కండరాలలో ఒత్తిడి తగ్గి కొంచెం ఉపశమనం కలుగుతుంది. ఆహారాన్ని మార్చండి వారంలో ఒక రోజు కూరగాయలను, తాజా పండ్ల రసాలను తాగండి. ఇవి మీ శరీరంలోని వెన్నుపూసలలో కలిగే వాపులను తగ్గిస్తుంది. ఆర్థ్రైటీస్ వలన భాదపడేవారు త్వరగా కొలుకొటానికి తినే ఆహారంలో అల్లం, తేనె, వంటి వాటిని కలుపుకోవాలి. ఎక్కువ యాంటీ-ఆక్సిడెంట్స్'ని అందించే, గ్రీన్-టీ, వలన నొప్పి నుండి త్వరగా కోలుకుంటారు. మసాజ్ వెన్నుపూస పై నొప్పికి మసాజ్ ఒక ప్రక్రియ, మీరు నొప్పిగా భావించే ప్రదేశంలో మసాజ్ చేయటం వలన అక్కడ ఉండే కణాలు ఒత్తిడికి గురి అయ్యి, కండరాలలో కదలికలు ఏర్పడి, బిగుతుగా ఉండే మీ వెన్ను భాగము ఉపశమనం పొంది, నొప్పులు తగ్గిపోతాయి. మసాజ్ చేయటం వలన నొప్పిగా అనిపించిన ప్రాంతాలలో రక్తప్రసరణ సరిగా జరిగి, నొప్పి తగ్గిపోతుంది. వేడి నీటితో స్నానం చేయటం వలన కండరాలు ఉద్దీపనకి గురైయి, వెన్ను నొప్పిని తోలగిస్తాయి.

Comments

Popular posts from this blog

వజ్రాసనం వల్ల గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు -- వజ్రాసనం

వజ్రాసనం వల్ల గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు శరీరాన్ని ఎల్లప్పుడూ కండిషన్‌లో ఉంచే అద్భుతమైన ఆసనం వజ్రాసనమే. పేరుకి తగ్గట్లే అది శరీరాన్ని వజ్రంలా చేస్తుంది.... క్రమంతప్పకుండా వజ్రాసనాన్ని ప్రతిరోజు చేస్తున్న పక్షంలో దేహానికి పటుత్వం, స్థిరత్వం ఏర్పడుతుంది. సంస్కృత భాషలో 'వజ్ర' అనగా దృఢం అని అర్ధం. వజ్రాసన భంగిమను దాల్చిన యోగసాధకులు దృఢమైన చిత్తానికి ప్రతినిధులుగా కనిపిస్తారు. తదనుగుణంగా ఈ ఆసనానికి వజ్రాసనమనే పేరు వచ్చింది. మిగతా అన్ని ఆసనాలను ఎప్పుడు పడితే అప్పుడు వేయడం సరైనది కాదు. కానీ వజ్రాసనాన్ని 24 గంటల్లో ఎప్పుడైనా వేయొచ్చు. ఈ ఆసనంలో మెడిటేషన్ చేయొచ్చు, ప్రాణాయామం చేయొచ్చు.... ఆస‌నం వేయు విధానం: A) కాళ్లను ముందుకు చాపి దండాసన పద్ధతిలో కూర్చోవాలి. B)మోకాళ్ల మీద కూర్చోవాలి. ఎడ‌మ‌కాలి బ్రొట‌న‌ వేలు కుడికాలి బ్రోట‌న వేలు దగ్గరగా వుంచి పాదాల పైభాగం నేల‌ను తాకేట‌ట్టు వెడ‌ల్పు చేయాలి. C)రెండు పాదాల లోప‌లి భాగం 'V' ఆకృతిలో వుంటుంది. దాని మ‌ధ్య భాగంతో కూర్చొవాలి. శ‌రీర పీఠ భాగం పూర్తిగా పాదాల మ‌ధ్య ఇమిడేట‌ట్లు చూసుకోవాలి. D)రెండు అరిచేతులు తొడ‌లు పై వుంచాలి. మెడ, వీపు,...

యోగ అంటే ఏమిటి?

యోగ అంటే ఏమిటి? "యుజ్" అనే సంస్కృత ధాతువు నుండి "యోగ" అనే పదం ఉత్పన్నమైంది. మానవుని మానసిక శక్తులన్నింటిని ఏకాగ్రత సాధించడం యోగము. "యుజ్" అనగా "కలయిక". యోగా అంటే వ్యాయామ సాధనల సమాహారాల రూపం. యోగములో భాగమైన శారీరకమైన ఆసనాలు శరీరారోగ్యానికి తోడ్పడి ఔషధాల వాడకాన్ని తగ్గించి దేహధారుడ్యాన్ని, ముఖ వర్చస్సుని ఇనుమడింప చేస్తుంది. సింధు నాగరికత చిత్రాల ఆధారంగా యోగా వారి నాగరికతలో భాగంగా విశ్వసిస్తున్నారు. సన్యాస శిక్షణలోను యోగా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇతర వ్యాయామాకంటే భిన్నమైన యోగాభ్యాసము దానిలో దేశవిదేశాలలో విశేషప్రాచుర్యాన్ని సంతరించుకున్నది. యోగా ప్రాచుర్యము, ఆదరణ అమోఘమైనది. యోగా మీద ఉన్న విశేషమైన మక్కువ, ఆకర్షణ లోక విదితం. భారతీయ సంప్రదాయిక యోగశిక్షణా తరగతులను అనేక దేశాలలో నిర్వహిస్తున్నారు. ఇతర వ్యాయాయములు శరీరదారుఢ్యాన్ని మాత్రమే మెరుగు పరచడములోదృష్టిని సారిస్తాయి. యోగాభ్యాసము లోని ధ్యానం, ప్రాణాయామం లాంటి ప్రక్రియలు మానసిక ఏకాగ్రత వలన ప్రశాంతతను కలిగించి మానసిక ఆరోగ్యానికి కూడా దోహద పడుతుంది. మానసిక వత్తిడులు, హృద్రోగము, రక్తపోటు లాంటి వ్యాధ...

శరీరాకృతిని మెరుగుపరుచుకునే యోగ --తాడాసనం

శరీరాకృతిని మెరుగుపరుచుకునే యోగ మీ శరీరాకృతిని జీవితాంతం ఉంచుకోవడానికి పరిష్కారం యోగానే, మీరు మీ శరీరాకృతి కోసం ఎన్నో చేస్తూ ఉంటారు, రాత్రి పూట భోజనం మానేయడం, మధ్యాహ్నం అకలితో పని చేసుకోవడం, ట్రెడ్మిల్ యంత్రం పై పరుగులు తీయడం,ఇలా ఎన్నో చేస్తూ అసలు విషయం మరచిపొతూ ఉంటారు, మనం తెలుసుకోవలసింది, ఆరోగ్యం మరియు ఫిట్నెస్ పొందాలంటే, మన మానసిక ఆరోగ్యం ఎంతో ప్రశాంతంగా ఉంచుకోవాలి. మానసిక ప్రశాంతతను యోగ ద్వారా పొందవచ్చు. ఆరోగ్యం, శరీరాకృతి మరియు ఫిట్నెస్ కోసం తాడాసన సిరీస్ ఉపయోగపడుతుంది. తాడాసనం: తాడ అంటే సంస్కృతంలో పర్వతమని అర్థం. యోగప్రక్రియలో కదలకుండా సమస్థతిలో నిలబడి చేసేదే తాడాసనం. తాడాసనం: ఆసనం వేయు పద్దతి : A) రెండు పాదముల మధ్య కొంచెం దూరముగా ఉండునట్లుగా నిలబడి నిటారుగా ఉండాలి. మోకాళ్ళు, తొడలు, పిరుదలు, ఉదర భాగంలోని కండరాలను కొద్దిగా బిగుతుగా ఉండేలా చూడాలి. స్థిర స్థితిలో ఉండాలి. ముక్కు రంధ్రం ద్వారా గాలి పీల్చుకోవాలి. B) అలాగే భుజాలను పైకి లేపి చేతులను కలపాలి. అదేసమయంలో కలిపిన అరచేతులు ఆకాశాన్ని చూస్తూ ఉండాలి. C) ఈ విధంగా చేసే సమయంలో కాలివేళ్ళపై నిలబడుతూ పైకి లేవాలి. కొద్ది సమయం అ...