Skip to main content

మెడ ఆకృతి, ఆరోగ్యాన్ని పెంచే యోగా

మెడ ఆకృతి, ఆరోగ్యాన్ని పెంచే యోగా మెడ ముఖానికి అందాన్ని జతచేస్తుంది.ఒత్తిడి మెడ కండరాలను బిగుతుపరిచి, కండరాల అలసటకు దోహదం చేస్తుంది.యోగ ఆరోగ్యమైన మెడను పొందుటకు సహాయపడుతుంది.మెడకు మంచి ప్రయోజనాలు పొందుటకు యోగాభ్యాసం దోహదం చేస్తుంది. మెడ సన్నని కాండంలాంటి అవయవం, తలకి ఇరువైపులా మద్దతును ఇవ్వడంతో పాటు, తలను పైకి మరియు క్రిందికి వంచడానికి మరియు దాదాపు 180 డిగ్రీల వరకు తిప్పడానికి అనుమతిస్తుంది. మెడపై నిరంతర కదలికల కారణంగా చర్మంపై ఏర్పడే వృద్ధాప్య సంకేతాలు, దుస్తులు మరియు బయటి వాతావరణం వలన కలిగే ఘర్షణ వంటివి చాలా ప్రభావితం చేస్తాయి. రోజువారీ అలవాట్లు కూడా చర్మం కుంగిపోవడానికి దోహదం చేస్తాయి. ఒక ఇబ్బందికరమైన స్థితిలో నిద్రించడం, హఠాత్తుగా పడుకోవడం, చెవికి మరియు భుజానికి మధ్య సెల్ ఫోన్ ను నొక్కి పట్టడం, కోపం, భయం లేదా మానసిక ఒత్తిడి వంటివి మెడ కండరాలు బిగుసుకు పోవడానికి, కండరాల అలసటకు దోహదం చేస్తాయి. మెడను నాణ్యతతో మరియు ఆరోగ్యాంతో కొనసాగించటానికి కొన్ని ప్రత్యేక ఆసనాలు చేయాల్సిన అవసరం ఉంది. (గ్రీవ అనగా సంస్కృతిలో మెడ) "గ్రీవ సంచలన ఆసనాలు" భుజాలను ముందుకు ఉంచి, కళ్ళను నెమ్మదిగా మూసుకొని మెడకు విశ్రాంతి పొందే విధంగా నిటారుగా కూర్చోవాలి. మెడను ముందుకు మరియు వెనుకకు వంచండి. ముఖ కండరాలకు విశ్రాంతిని కల్పించే విధంగా తలను నెమ్మదిగా వెనుక భాగంకు అనగా వీపు వైపు వంచాలి. నెమ్మదిగా తలను యదాస్థానానికి తీసుకురండి. ఇప్పుడు తలను నెమ్మదిగా వీలైనంత వరకు ముందుకు వంచండి. నెమ్మదిగా తిరిగి యదాస్థానానికి తీసుకురండి. ఇది ఒక పర్యాయం. ఈ విధంగానే 10 పర్యాయాలు చేయండి. భుజం వైపు చెవిని వంచండి. భుజాలని ఎత్తకుండా తలను నెమ్మదిగా ఎడమవైపుకు వంచండి మరియు ఇపుడు తలను పైకి ఎత్తి యదాస్థానానికి తీసుకురావాలి. ఇపుడు తలను మధ్య భాగం నుండి కుడి వైపుకు వంచాలి మరియు యదాస్థానానికి తీసుకురావాలి. ఈ విధంగా మెడను వంచినపుడు మెడ కండరాలు దాని వ్యతిరేకపు వైపుకు లాగినట్లుగా అన్పిస్తుంది. మెడను కుడి వైపు వంచినపుడు ఎడమవైపు మెడ కండరాలు లాగినట్లుగా అన్పిస్తుంది మరియు అటు వంచితే ఇటు, ఇటు వంచితే అటు మారుతుంది. ఇది ఒక పర్యాయం. ఈ విధంగానే 10 పర్యాయాలు చేయండి. ప్రక్క ప్రక్కనకు తిప్పుట. భుజాలను అలానే ఉంచుకుని మరియు తలను నిటారుగా చాలా నెమ్మదిగా మరియు సమానంగా మీకు సౌకర్యవంతంగా ఉన్నంతవరకు కుడి వైపునకు తిప్పండి, కొన్ని సెకన్ల పాటు అలానే ఉండండి మరియు తలను ఇపుడు యదాస్థానానికి తీసుకురండి. ఇప్పుడు నెమ్మదిగా మీకు సౌకర్యవంతంగా ఉన్నంతవరకు మాత్రమే ఎడమ వైపునకు తిప్పండి. కొన్ని సెకన్ల పాటు అలానే ఉండండి మరియు తలను ఇపుడు యదాస్థానానికి తీసుకురండి. ఈవిధంగా తలను తిప్పినపుడు కండరాలు సంకోచం చెందుతాయి మరియు తిరిగి యధాస్థితికి వచ్చినపుడు విశ్రాంతి పొందుతాయి. ఇది ఒక పర్యాయం. ఈ విధంగానే 10 పర్యాయాలు చేయండి. మెడను తిప్పడం (సవ్యదిశలో మరియు అపసవ్యదిశలో) మెడను విశ్రాంతి పొందేవిధంగా ఉంచుతూ మరియు మీ భుజాలు ముందు వైపుకు ఉంచి తల క్రిందికి వంచండి మరియు కుడి చెవి వరకు కుడి భుజానికి దగ్గరగా వచ్చేంతవరకు తలను కుడి వైపు తిప్పుతూ ఉండండి (భుజాన్ని పైకి ఎత్తకూడదు) మీకు సౌకర్యవంతంగా ఉన్నతవరకు తిప్పుతూ ఉండండి మరియు ఇపుడు ఎడమ చెవి ఎడమ భుజానికి సమీపానికి వచ్చేంతవరకు తలను ఎడమ వైపుకు తిప్పుతూ ఉండండి మరియు ఒక వలయాకారంను పూర్తి చేస్తూ తలను ప్రారంభ స్థానంకు తీసుకురావాలి. ఇది ఒక పర్యాయం. సవ్యదిశలో ఐదు మార్లు మరియు అపసవ్యదిశలో ఐదు మార్లు చేయండి. భుజాలను పైకెత్తడం. ముఖాన్ని ముందు వైపు ఉంచాలి మరియు మెడను ముందు వైపు చూస్తున్నట్లుగా ఉంచి భుజాలకు విశ్రాంతిని కల్పిస్తూ, నెమ్మదిగా మరియు శాంతముగా రెండు భుజాలను చెవుల వైపుకు ఎత్తండి మరియు నెమ్మదిగా, తిరిగి ప్రారంభ స్థానంకు వచ్చేయండి. ఇది ఒక పర్యాయం. ఈ విధంగానే 10 పర్యాయాలు చేయండి. దవడలను నొక్కిపట్టుట. మీ నోరు తెరిచి మరియు మీకు వీలున్నంతవరకు నాలుకను బయటకు తీసుకురండి, నాలుక కొన వైపు గురిపెట్టండి. మీ మెడ కండరాలు బిగుసుకున్న అనుభూతిని పొందాలి, మీ మెడ యొక్క నరాలు బయటకు కన్పించేంతవరకు మీ దవడలను గట్టిగా నొక్కిపట్టండి. మీకు సౌకర్యవంతంగా ఉన్నంతవరకు ఈ విధంగానే నొక్కి పట్టుకోండి. ఇది ఒక పర్యాయం. ఈ విధంగానే 10 పర్యాయాలు చేయండి. ముఖాన్ని ముందు వైపు ఉంచాలి మరియు భుజాలకు విశ్రాంతిని కల్పిస్తూ, మీ మెడ ముందు కండరాలను సంకోచింపచేయాలి. వాటిని దృఢంగా మరియు బిగువుగా చేయడానికి ప్రయత్నించండి. మీ దంతాలను బిగుతుగా నొక్కి పట్టి ఉంచాలి మరియు మీ మెడ యొక్క నరాలు బయటకు కన్పించేంతవరకు మీ దవడలను గట్టిగా నొక్కిపట్టండి. ఇది ఒక పర్యాయం. ఈ విధంగానే 10 పర్యాయాలు చేయండి. ప్రయోజనాలు: ఒక రోజులో కొన్ని నిమిషాలు "గ్రీవ సంచలన ఆసనాలు" అభ్యసించడం ద్వారా కఠినమైన, సున్నితమైన మరియు ఒక చక్కని బిగుతైన మెడను పొందవచ్చు. నిద్ర, దృష్టి మరియు వినికిడి సామర్ధ్యాలను మెరుగుపరుస్తుంది, మరియు మెడ నరాలు మెదడుకు అనుసంధించబడి ఉంటాయి కావున తలనొప్పిని నిరోధిస్తుంది. థైరాయిడ్ గ్రంధి బాగా ఉత్తేజితమై అది స్రవించు హార్మోన్ లను క్రమపరచబడును. జీవక్రియలను నియంత్రించి క్రమపరచబడును. ఎముకలు దృడముగా అగును. జాగ్రత్తలు మెడ వ్యాయామాలను నెమ్మదిగా కదులుతూ, సజావుగా మరియు కండరాలు అదిమి పట్టకుండా జాగ్రత్తగా చేయండి. అధిక బిపి, సెర్వికల్ స్పాండిలైటిస్, గర్భంతో ఉన్నవారు ఎక్కువగా వెనక్కి లేదా ముందుకు వంగకుండా జాగ్రత్తగా చేయాలి. ముక్కు ద్వారా శ్వాసను నెమ్మదిగా తీసుకోవాలి. మీరు ఒక నిర్దిష్ట స్థానంలో ఉన్నపుడు నొప్పిని కనుగొంటే వెంటనే ఆ వ్యాయామం ఆపి వేయండి. వ్యాయామ నియమావళిని నిర్దేశించుకొని క్రమం తప్పకుండా వీటిని అభ్యసించండం ద్వారా అధిక ప్రయోజనాలు పొందవచ్చు.

Comments

Popular posts from this blog

వజ్రాసనం వల్ల గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు -- వజ్రాసనం

వజ్రాసనం వల్ల గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు శరీరాన్ని ఎల్లప్పుడూ కండిషన్‌లో ఉంచే అద్భుతమైన ఆసనం వజ్రాసనమే. పేరుకి తగ్గట్లే అది శరీరాన్ని వజ్రంలా చేస్తుంది.... క్రమంతప్పకుండా వజ్రాసనాన్ని ప్రతిరోజు చేస్తున్న పక్షంలో దేహానికి పటుత్వం, స్థిరత్వం ఏర్పడుతుంది. సంస్కృత భాషలో 'వజ్ర' అనగా దృఢం అని అర్ధం. వజ్రాసన భంగిమను దాల్చిన యోగసాధకులు దృఢమైన చిత్తానికి ప్రతినిధులుగా కనిపిస్తారు. తదనుగుణంగా ఈ ఆసనానికి వజ్రాసనమనే పేరు వచ్చింది. మిగతా అన్ని ఆసనాలను ఎప్పుడు పడితే అప్పుడు వేయడం సరైనది కాదు. కానీ వజ్రాసనాన్ని 24 గంటల్లో ఎప్పుడైనా వేయొచ్చు. ఈ ఆసనంలో మెడిటేషన్ చేయొచ్చు, ప్రాణాయామం చేయొచ్చు.... ఆస‌నం వేయు విధానం: A) కాళ్లను ముందుకు చాపి దండాసన పద్ధతిలో కూర్చోవాలి. B)మోకాళ్ల మీద కూర్చోవాలి. ఎడ‌మ‌కాలి బ్రొట‌న‌ వేలు కుడికాలి బ్రోట‌న వేలు దగ్గరగా వుంచి పాదాల పైభాగం నేల‌ను తాకేట‌ట్టు వెడ‌ల్పు చేయాలి. C)రెండు పాదాల లోప‌లి భాగం 'V' ఆకృతిలో వుంటుంది. దాని మ‌ధ్య భాగంతో కూర్చొవాలి. శ‌రీర పీఠ భాగం పూర్తిగా పాదాల మ‌ధ్య ఇమిడేట‌ట్లు చూసుకోవాలి. D)రెండు అరిచేతులు తొడ‌లు పై వుంచాలి. మెడ, వీపు,...

యోగ అంటే ఏమిటి?

యోగ అంటే ఏమిటి? "యుజ్" అనే సంస్కృత ధాతువు నుండి "యోగ" అనే పదం ఉత్పన్నమైంది. మానవుని మానసిక శక్తులన్నింటిని ఏకాగ్రత సాధించడం యోగము. "యుజ్" అనగా "కలయిక". యోగా అంటే వ్యాయామ సాధనల సమాహారాల రూపం. యోగములో భాగమైన శారీరకమైన ఆసనాలు శరీరారోగ్యానికి తోడ్పడి ఔషధాల వాడకాన్ని తగ్గించి దేహధారుడ్యాన్ని, ముఖ వర్చస్సుని ఇనుమడింప చేస్తుంది. సింధు నాగరికత చిత్రాల ఆధారంగా యోగా వారి నాగరికతలో భాగంగా విశ్వసిస్తున్నారు. సన్యాస శిక్షణలోను యోగా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇతర వ్యాయామాకంటే భిన్నమైన యోగాభ్యాసము దానిలో దేశవిదేశాలలో విశేషప్రాచుర్యాన్ని సంతరించుకున్నది. యోగా ప్రాచుర్యము, ఆదరణ అమోఘమైనది. యోగా మీద ఉన్న విశేషమైన మక్కువ, ఆకర్షణ లోక విదితం. భారతీయ సంప్రదాయిక యోగశిక్షణా తరగతులను అనేక దేశాలలో నిర్వహిస్తున్నారు. ఇతర వ్యాయాయములు శరీరదారుఢ్యాన్ని మాత్రమే మెరుగు పరచడములోదృష్టిని సారిస్తాయి. యోగాభ్యాసము లోని ధ్యానం, ప్రాణాయామం లాంటి ప్రక్రియలు మానసిక ఏకాగ్రత వలన ప్రశాంతతను కలిగించి మానసిక ఆరోగ్యానికి కూడా దోహద పడుతుంది. మానసిక వత్తిడులు, హృద్రోగము, రక్తపోటు లాంటి వ్యాధ...

శరీరాకృతిని మెరుగుపరుచుకునే యోగ --తాడాసనం

శరీరాకృతిని మెరుగుపరుచుకునే యోగ మీ శరీరాకృతిని జీవితాంతం ఉంచుకోవడానికి పరిష్కారం యోగానే, మీరు మీ శరీరాకృతి కోసం ఎన్నో చేస్తూ ఉంటారు, రాత్రి పూట భోజనం మానేయడం, మధ్యాహ్నం అకలితో పని చేసుకోవడం, ట్రెడ్మిల్ యంత్రం పై పరుగులు తీయడం,ఇలా ఎన్నో చేస్తూ అసలు విషయం మరచిపొతూ ఉంటారు, మనం తెలుసుకోవలసింది, ఆరోగ్యం మరియు ఫిట్నెస్ పొందాలంటే, మన మానసిక ఆరోగ్యం ఎంతో ప్రశాంతంగా ఉంచుకోవాలి. మానసిక ప్రశాంతతను యోగ ద్వారా పొందవచ్చు. ఆరోగ్యం, శరీరాకృతి మరియు ఫిట్నెస్ కోసం తాడాసన సిరీస్ ఉపయోగపడుతుంది. తాడాసనం: తాడ అంటే సంస్కృతంలో పర్వతమని అర్థం. యోగప్రక్రియలో కదలకుండా సమస్థతిలో నిలబడి చేసేదే తాడాసనం. తాడాసనం: ఆసనం వేయు పద్దతి : A) రెండు పాదముల మధ్య కొంచెం దూరముగా ఉండునట్లుగా నిలబడి నిటారుగా ఉండాలి. మోకాళ్ళు, తొడలు, పిరుదలు, ఉదర భాగంలోని కండరాలను కొద్దిగా బిగుతుగా ఉండేలా చూడాలి. స్థిర స్థితిలో ఉండాలి. ముక్కు రంధ్రం ద్వారా గాలి పీల్చుకోవాలి. B) అలాగే భుజాలను పైకి లేపి చేతులను కలపాలి. అదేసమయంలో కలిపిన అరచేతులు ఆకాశాన్ని చూస్తూ ఉండాలి. C) ఈ విధంగా చేసే సమయంలో కాలివేళ్ళపై నిలబడుతూ పైకి లేవాలి. కొద్ది సమయం అ...