చక్రాసనము : ఈ ఆసనం చక్రం ఆకారంలో ఉంటుంది కనుక దీనికి చక్రాసనమని పేరువచ్చింది. చక్రాసనము ఆసనం వేయు విధానం: మొదట వెల్లకిలా పడుకోవాలి. A) పాదములు పిరుదుల వద్దకు తీసుకువచ్చి నేలకు త్ర్రాకించాలి. చేతులను పైనుండి తీసుకువెళ్ళి తలకు ఇరువైపులా నేలకు త్రాకించాలి. B) చేతుల సాయంతో నడుమును వీలైనంత పైకి ఎత్తాలి. తలను నేలపై ఆనించాలి. C) సుధీర్ఘ శ్వాస తీసుకుంటూ చేతుల సాయంతో శరీరాన్ని పైకి తీసుకురావలి. మెడ కిందికి వేలాడుతుండాలి. ఇదియే చక్రాసనము. B) ఉండగలిగినంతసేపు ఈ స్థితిలో ఉన్న తరువాత మెల్లమెల్లగా తలను నేలపై ఆనించాలి. నడుమును గూడా ఆనించి తర్వాత కొద్ది క్షణాల సేపు శవాసనం వేసి విశ్రాంతి తీసుకోవాలి. సూచన: ప్రారంభదశలో తలను నేలపైననే ఆనించి అర్థ చక్రాసనం(B) అభ్యాసం చేయవచ్చును. చేతులపై శరీరం బరువును ఆపగలమన్న ధైర్య కలిగేవరకు తల ఆనించి అభ్యాసం కొనసాగించవచ్చును. చక్రాసనము ఉపయోగం: 1. వయస్సు పెరగకుండా చేయును. 2. ముఖము కాంతివంతమగును. 3. వెన్నుముక బలోపేతమై ధ్యాన సాధనకు ఉపయోగపడును. 4. థైరాయిడ్, గ్యాస్ట్రిక్, మలబద్ధకం తొలగును. 5. చేతి కండరాలు, తొడలు, కాలి కండరాలు బలోపేతమగును. 6. ఆస్త్మా, సైనస్ వంట...